మిమిక్రీ సామ్రాట్ : సినీ రంగం నుంచే ప్రస్థానం మొదలు

nerella-venu-madhav-filmsవరంగల్ లోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు నేరెళ్ల వేణుమాదవ్. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండడంతో.. ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. ఈ ప్రభావం వేణుమాధవ్ పై పడింది. నేరేళ్లకు సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్యపై అభిమానం పెంచుకున్నారు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలు, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం.

1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు నేరెళ్ల. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు గారు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు గారు పరమానందభరితులై “యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్” అని, ఇక నుంచి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్  అయితే నీవు నా రెండో కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని మిమిక్రీ సామ్రాట్ గా ఎదిగేలా చేశాయి.

Posted in Uncategorized

Latest Updates