మిమ్మల్ని మార్చటం కష్టం : పాక్ క్రికెట్ టీంపై చేతబడి జరిగిందంట

NNఅండర్ 19 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ ఎంత దారుణంగా ఓడిపోయిందో తెలుసు కదా. కేవలం 69 పరుగులకే కుప్పకూలి ఏకంగా 203 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమికి ఆ టీమ్ మేనేజర్ నదీమ్ ఖాన్ చెప్పిన కారణం చూసి ఇప్పుడు పాక్ అభిమానులు నవ్వాలా ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారు. తమ ప్లేయర్స్‌పై చేతబడి జరిగిందని, అందుకే ఓడిపోయామని అంటున్నారు. అభిమానులు జీర్ణించుకోలేని ఓ వింత థియరీని తెరపైకి తీసుకొచ్చాడు.

మేం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అనుకున్నాం. మ్యాచ్ గడిచే కొద్దీ.. మా బ్యాటింగ్ కుప్పకూలింది. 69 పరుగులకే కుప్పకూలాం. ఆ దశలో మావాళ్లపై ఏదైనా చేతబడి జరిగిందా అన్న అనుమానం కలిగింది అని నదీమ్ ఖాన్ అన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో తెలియక, ఒత్తిడిని తట్టుకోలేక తమ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారని నదీమ్ చెప్పాడు. ఇదే నదీమ్ ఖాన్ 1999లో ఇండియా టూర్‌కు వచ్చిన పాకిస్థాన్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates