మిర్యాలగూడ అభివృద్దికి 200 కోట్లు : కేటీఆర్

KTR-Live-From-Miryalaguda2019లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. తన సవాల్ కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కష్టాలుండేవని, కనీసం ఆరుగంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను, ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన జనహిత ప్రగతిసభలో మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి రెండు విడతలుగా 2వందల కోట్లు ఇస్తామన్నారు మంత్రి. పట్టణంలో అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు. అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates