మిషన్ భగీరథకు ఆగస్టు 14 అర్థరాత్రి డెడ్‌ లైన్‌: సీఎం కేసీఆర్

ఇంటింటికి మంచినీరందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం మిషన్ భగీరథ. ఈ పనులపై సీఎం కేసీఆర్ గురువారం (జూలై-19) సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇప్పటికే పనులు పూర్తైన చోట ప్రారంభంలో వచ్చే చిన్న సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించుకుంటూ పోవాలన్నారు. మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా సమన్వయంతో నిర్వహించేందుకు RWS శాఖను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారు.

మిషన్ భగీరథ ప్రాజెక్టులో మెజారిటీ శాతం పనులు పూర్తయ్యాయని.. వేలాది గ్రామాలకు ఇప్పటికే నీరు చేరుతుందన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు, మరికొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్న సీఎం.. ఆగస్టు 14 అర్థరాత్రిని డెడ్‌ లైన్‌ గా పెట్టుకుని అన్ని గ్రామాలకు ఆ రోజులోగా నీరు అందించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates