మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అద్భుతం : కేసీఆర్

KCR MISSIONమిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన గ్రామాలకు ఆగస్టు చివరినాటికి మంచినీరు అందాలని చెప్పారు. అంతర్గత పనులను  త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గడువులోగా పనులను పూర్తిచేయాలని.. లేకుంటే వర్క్ ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథలో వేగం పెంచాలని చెప్పారు. మిషన్ భగీరథ చాలా పెద్ద ప్రాజెక్టని.. ఇంజినీరింగ్ అద్భుతమని.. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు  మంచి పేరు వస్తుందని చెప్పారు సీఎం  KCR.

రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో కనీస నీటి సేకరణ స్థాయి (మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ – ఎండీడీఎల్) నిర్వహించాలని సూచించారు సీఎం. తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్‌చేసిన తర్వాత సాగునీటికి నీరు విడుదలచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. అగ్రిమెంటు ప్రకారం  దానికన్నా అదనంగా పడే GSTని ప్రభుత్వమే చెల్లిస్తుందని  హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న ప్రాంతంలో.. భూ ఉపరితలంపై గ్యాస్ పైపులైన్ల వద్ద పెట్టే విధంగా ఇండికేటర్స్ పెట్టాలని సూచించారు సీఎం కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates