మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం

MISSIONతాగునీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ దేశం మొత్తానికి ఆదర్శమన్నారు 15 వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టును ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం అభినందనీయం అన్నారు. శనివారం (ఫిబ్రవరి-10) గజ్వేల్ కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ హెడ్ వర్క్స్ ను సీఎస్.. ఎస్.కే జోషితో కలిసి పరిశీలించారు అరవింద్ మెహతా. అక్కడ ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. 20 ఏళ్ల కిందట సిద్దిపేటలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్పూర్తి అన్నారు అధికారులు.

98 శాతం నీటి సరాఫరా గ్రావిటీతోనే జరుగుతుందని తెలుసుకున్న మెహతా, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారని మెచ్చుకున్నారు. ఇతర రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులు ఈ ప్రాజెక్టు నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. మనదేశంలో వచ్చే ఎన్నో వ్యాధులకు అపరిశుభ్ర తాగునీరే కారణమని, మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీరు హక్కుగా దొరకుతుందన్నారు. ఇంటింటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్ ను అందించి తెలంగాణ చరిత్ర సృష్టించబోతుందన్నారు. మిషన్ భగీరథ ఇవాళ టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచిందన్నారు ఎస్.కే జోషి.

Posted in Uncategorized

Latest Updates