మిషన్ భగీరథ వాటర్ గిడ్ ను ప్రారంభించిన కేటీఆర్

KTR..వనపర్తి నియోజకవర్గంలో రూ. 345 కోట్లతో కనాయిపల్లిలో నిర్మించిన మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌ను మంత్రి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. శుక్రవారం వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారుమంత్రి. 22వ వార్డులో పార్కు నిర్మాణంకు శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ గ్రిడ్‌తో గ్రామాన్ని అనుసంధానం చేసే పనులను ఆయన ప్రారంభించారు.

Posted in Uncategorized

Latest Updates