మిషన్ భగీరధలో మెదక్ టాప్ : హరీష్

HARISHమిషన్ భగీరధలో ఉమ్మడి మెదక్ జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. జిల్లాలో భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 2వేలకు పైచిలుకు గ్రామాలకు మంచినీరు అందుతుందన్నారు. మిగితా పనులను కూడా త్వరగా పూర్తిచేస్తామన్నారు.

బుధవారం (జూన్-7) సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి…  జిల్లాలోని బుదేరలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ వెల్ఫేర్ ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే బాబుమోహన్ తో కలిసి మంచినీటి శుద్ది కేంద్రాన్ని పరిశీలించారు.

 

Posted in Uncategorized

Latest Updates