మిసైల్స్ మీటింగ్ ఫిక్స్ : 12న ఉదయం 9 గంటలకు ట్రంప్-కిమ్ భేటీ

trumpఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ , ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీకి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. అయితే వీరికి మీటింగ్ కి భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా గగనతలంపైనా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలు తమ వేగాన్ని తగ్గించుకోవాలని ఆదేశించారు. రన్ వే పైనా ఆంక్షలు పెట్టారు. నిబంధనలు పాటించని సంస్థలపై కఠినచర్యలు తీసుకుంటామని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చెప్పింది. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ వీరి మీటింగ్ పై ఆశక్తిగా ఎదురుచూస్తున్నాయి. అణ్వాయుధ ప్రయోగాలను బంద్ చేయాలని కిమ్ ను ఈ మీటింగ్ సందర్భంగా ట్రంప్ కోరే అవకాశముంది. ఉత్తరకొరిమాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ట్రంప్ ను కిమ్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిమ్ తన అణ్వాస్త్ర ప్రయోగాలకు స్వల్ప విరామం ప్రకటించారు. గత నెలలో రెండు సార్లు చైనా వెళ్లి అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు కిమ్.

 

Posted in Uncategorized

Latest Updates