మిస్టరీ ఏంటీ : మాజీ రేడియో జాకీ హత్య

jockey
ఓ ప్రముఖ ఎఫ్ఎం కంపెనీలో రేడియో జాకీ, మిమిక్రీ ఆర్టిస్ట్ హత్య కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో మార్చి 27వ తేదీ మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. 36 ఏళ్ల రాజేశ్ రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా పని చేశారు. ఇటీవలే సొంత స్టూడియో పెట్టుకుని.. ఫోక్ సాంగ్స్ (జానపదాలు)పై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం తిరువనంతపురం సిటీలోని పాలక్కల్ పోలీస్ట స్టేషన్ పరిధిలోని తన స్టూడియో నుంచి స్నేహితులతో కలిసి కారులో బయటకు వచ్చారు. దారి మధ్యలో రాజేశ్ కారును అడ్డుకుని.. కత్తులతో అతనిపై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని స్నేహితునిపైనా దాడి చేశారు దుండగులు.

నడిరోడ్డుపై జరిగిన ఈ దాడి ఉద్రిక్తతకి దారితీసింది. గాయపడిన రాజేశ్, అతని స్నేహితుడిని స్థానికులే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేడియో జాకీ రాజేశ్ చనిపోయాడు. అతని స్నేహితుడి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం రాజేశ్ సొంత కంపెనీ పెట్టుకుని.. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హత్యకి గురవ్వటం కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates