మిస్టరీ: 600 మంది అమ్మాయిలు అదృశ్యం

daati-maharajశిష్యురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మికవేత్త దాతీ మహారాజ్‌ ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకొనే దాతీ మహారాజ్‌ రాజస్థాన్‌లో అల్వాస్‌లోని ఆశ్రమం నిర్వహిస్తున్నారు. అయితే, తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి బాగోగులు తానే చూసుకుంటున్నానంటూ గతంలో అనేకసార్లు ఆయన చెప్పుకున్నారు.

ఈ క్రమంలో తనపై అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్లు సమాచారం. మిగిలిన అమ్మాయిల సంగతి ఏమైందని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ను వెతుకుతున్నామని పోలీసు అధికారి తెలిపారు.

దాతీ మహారాజ్ తనను పదేళ్లపాటు పాటు ఆశ్రమంలో బందీ వుంచాడని.. ఆయన, ఆయన అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో దాతీ మహారాజ్‌ వారందరినీ ఆశ్రమానికి దూరంగా పంపడమో.. లేదంటే అమ్మాయిలంతా సెలవులకు వారి ఇళ్లకు వెళ్లి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates