‘మిస్టర్‌ కూల్‌’ ధోని బర్త్ డే

DHONIభారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన శనివారం(జులై-7). టీమ్ ఇండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌‌గా నిలిచిన ధోని 2004లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి  ఎంటరయ్యాడు.
భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ  శనివారం తన 37వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. అభిమానులు ముద్దుగా ‘మిస్టర్‌ కూల్‌’ అని పిలుచుకునే ధోనీకి  సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మ్యాచ్‌ కోసం ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈసందర్భంగా పాండ్య బ్రదర్స్‌ ‘హ్యాపీ బర్త్‌డే మహీ’ అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ధోనీ భార్య సాక్షితో సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates