మిస్టర్ కూల్ కోపడ్డాడు : పిచ్చోడిలా కన్పిస్తున్నానా…300 మ్యాచ్ లు ఆడాను

మిస్టర్ కూల్ కెప్టెన్ ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు మహేంద్రసింగ్ ధోనీ. గ్రౌండ్ లో ఎంత వత్తిడి ఉన్నా కూడా కూల్ గా కనిపిస్తాడు మహీ. కూల్ గానే సిరీస్ లను కైవసం చేపుకుంటాడు. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీకి కూడా గ్రౌండ్ లో కోపం వచ్చింది. ఆగ్రహావేశంతో ఊగపోయాడు. ఇంతకీ మిస్టర్ కూల్ ఎందుకింత కోపం తెచ్చుకున్నాడనుకుంటున్నారా?

2017లో ఇండోర్‌ లో భారత్‌- శ్రీలంకల మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 260 పరుగులు చేసింది. 261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాళ్లు స్కోర్ బోర్డుని పరుగెత్తిస్తున్నారు. ఆ సమయంలో బౌలిగ్ చేసిన టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌… బౌలింగ్‌ లో లంక బ్యాట్స్‌ మెన్‌ లు ఈజీగా బౌండరీలు కొడుతున్నారు. ఆ టైంలో కుల్దీప్ దగ్గరకు వచ్చిన ధోని…. బాల్ ని బ్యాట్స్‌ మెన్‌కు దూరంగా వేయాలని, ఫీల్డింగ్‌ మార్చుకోమని సూచించాడు. అప్పుడు ఏం ఫర్వాలేదు ధోని భాయ్‌ అని కుల్దీప్ అనడంతో… ఒక్కసారిగా మిస్టర్ కూల్ కంట్రోల్ తప్పాడు. కోపంతో ఊగిపోయాడు. 300 మ్యాచ్‌ లు ఆడాను. నీ కంటికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నాన్నా అంటూ కల్దీప్ పై కోపడ్డాడు. దీంతో ధోని చెప్పినట్లు బౌలింగ్‌ చేసి తరువాత కుల్దీప్ వికెట్‌ సాధించాను. అప్పుడు కుల్దీప్ దగ్గరకు వెళ్లిన ధోని.. నేను మొదట నుంచి చెప్పింది ఇదే కదా అన్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనను ఇటీవల ఓ షోకు హాజరైన కుల్దీప్‌ యాదవ్‌, చాహాల్‌ ధోనీతో తమకున్న అనుభవాల సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. 172 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.

Posted in Uncategorized

Latest Updates