మిస్టర్ జోడీ మరోసారి

Mister VARUNఫిదా, తొలిప్రేమ సినిమాలు హిట్ కావడంతో మంచి జోరు మీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ ..లేటెస్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణితో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌ టైన్మెంట్స్ సంస్థ  వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే.  ఘాజీ  ఫేం సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వరుణ్ సరసన అదితిరావు హైదరీని ఇప్పటికే సెలక్ట్  చేయగా.. లేటెస్ట్ గా మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేశారు.

ఈ విషయాన్ని సోమవారం (ఏప్రిల్-9) ట్విట్టర్ ద్వారా తెలిపింది లావణ్య. వరుణ్ తో మరోసారి ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని ట్విట్ చేసింది లావణ్య త్రిపాఠి. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఇప్పుడు మరో సారి స్క్రీన్ మీద సం‍దడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకు మొదలవ్వనుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates