మిస్‌ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్‌ సుందరి

 బ్యాంకాక్ : 2018 విశ్వ సుందరి కిరీటాన్ని ఫిలిప్సీన్స్  సుందరి దక్కించుకుంది. క్యాట్రియోనా ఎలీసా గ్రే విజేతగా నిలిచారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్  రన్నరప్ గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్  గ్రీన్ , రెండో రన్నరప్ గా వెనిజువెలాకు చెందిన స్టిఫెనీ నిలిచారు. భారత్ కు చెందిన నేహల్  చూడాసమా టాప్  20లోనూ స్థానం దక్కించుకోలేకపోయింది. 2017లో విశ్వసుందరి కిరీటం అందుకున్న దక్షిణాఫ్రికా భామ డెమీ లీ తన కిరీటాన్ని క్యాట్రియోనాకు అలంకరించారు.

ఈ కాంటెస్ట్ లోని ఆఖరి రౌండ్ లో న్యాయనిర్ణేతలు.. అడిగిన ప్రశ్నకు క్యాట్రియోనా అద్భుతమైన సమాధానం ఇచ్చి కిరీటం గెలుచుకున్నారు. మనీలాలోని స్లమ్ ఏరియాల్లో పిల్లలకు పాఠాలు చెబుతుంటానని, మురికివాడల్లో జీవనం నరకంగా ఉంటుందని, అయితే వారి జీవితాలను బాగు చేయాలనుకుంటున్నానని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates