మిస్ ఇండియా వరల్డ్ వైడ్ గా.. భారత సంతతి యువతి

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన యువతికి అరుదైన గౌరవం దక్కింది.  మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ కిరీటం భారతీయ అమెరికన్‌ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌ సిటీలో శనివారం డిసెంబర్-16న జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌ కు చెందిన అనూషా సరీన్‌ మొదటి, రెండో రన్నర్‌ అప్స్‌ గా సెలక్ట్ అయ్యారు.

శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్‌ చేయవద్దని చెప్పారు డాక్టర్లు.  అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోకుండా పోటీల్లో పాల్గొంది. విజేతగా నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates