మిస్ యూ డాడీ అని రాసుకుంది : బస్సులో యువతి సూసైడ్

పురుగుల మందుతాగి ఓ యువతి బస్సు లో సూసైడ్ చేసుకుంది. భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఎక్కింది ఓ యువతి. అయితే బస్సు ఎక్కేముందే ఆమె పాయిజన్ తీసుకుంది. బస్సు VM బంజరు వద్దకు రాగానే యువతి నోటి నుంచి నురగలు వస్తుండటంతో ..ప్రయాణికులు గమనించి డ్రైవర్, కండక్టర్ కు తెలిపారు. దీంతో వారు బస్సును సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అంతకుముందే ఆమె మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు.

ఐడీ కార్డు ఆధారంగా యువతి విజయవాడకు చెందిన లావణ్యగా గుర్తించారు. దీంతో పోలీసులు యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇటీవలే యువతికి పెళ్లిచూపులు జరిగినట్లు తెలిసింది. చేతిపై మిస్ యూ డాడీ అని పెన్నుతో రాసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఇష్టంలేకనే సూసైడ్ చేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates