మిస్ హైదరాబాద్-2018.. గౌరీప్రియ

మాదాపూర్ : మిస్ హైదరాబాద్ – 2018 కిరీటాన్ని అందాల బొమ్మ ‘గౌరీప్రియ’ గెల్చుకుంది. ‘మిస్ హైదరాబాద్-2018’ పోటీల గ్రాండ్ ఫినాలే పోటీలు… నిన్న(అక్టోబర్ 10) రాత్రి మాదాపూర్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ లో కళ్లు జిగేల్మనిపించేలా జరిగాయి. ఫైనలిస్టుల ర్యాంప్ షోతో మొదలైన ప్రోగ్రామ్…. సెలబ్రిటీల రాకతో మెరిసిపోయింది. 24 మంది అమ్మాయిలు… గ్రాండ్ ఫినాలేలో పోటీ పడ్డారు. చివరకు కిరీటాన్ని గౌరీ ప్రియ గెల్చుకుంది.

మొత్తం 20 రోజుల పాటు మిస్ హైదరాబాద్ 2018 కాంటెస్ట్ నిర్వహించారు. గ్రూమింగ్, స్టైలింగ్, ఫిట్టింగ్, ర్యాంప్ వాక్స్, డ్యాన్సింగ్, స్పీకింగ్, నాలెడ్జ్, టాలెంట్ ఇలా.. పలు రకాల రౌండ్ల తర్వాత… విజేతను ప్రకటించారు న్యాయ నిర్ణేతలు. 24 మందిలో… పది మందిని.. ఐదుగురిని ఎంపిక చేసిన జడ్జీలు.. ముగ్గురు ఫైనల్ విజేతలను ప్రకటించారు. విన్నర్ గా నిలిచిన గౌరీప్రియకు ‘మిస్‌ హైదరాబాద్‌’ క్రౌన్ దక్కింది. ఫస్ట్‌ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్‌ రన్నరప్‌గా రియా సింగ్‌ నిలిచారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీ రంగాల ప్రముఖులు వచ్చారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates