మీకు తిండి పెట్టలేం : ఖైదీలను వదిలేసిన ప్రభుత్వం

kgfఅడగకుండానే ఖైదీలకు క్షమా బిక్ష పెట్టేస్తుంది ఆ దేశం. జైళ్లు అన్నీ ఖైదీలతో నిండిపోవడంతో, కిక్కిరిసిన ఖైదీలను భరించలేక.. దీనికితోడు వాళ్లకు తిండి పెట్టలేక.. అందుకు కావాల్సిన డబ్బులు ప్రభుత్వం దగ్గర లేకపోవటంతో ఖైదీలను విడుదల చేస్తోంది జింబాబ్వే ప్రభుత్వం. వాళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును తాము భరించలేమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.

జింబాంబ్వే రాజధాని హరారేలో ఉన్న జైళ్లో 17వేల మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 20వేల మంది ఉన్నారు. దీంతో మూడేళ్లుగా అక్కడుంటున్న 3 వేల మంది ఖైదీలను క్షమాభిక్ష పేరుతో బయటకు పంపించేశారు. అధ్యక్షుడు ఎమ్మర్సన్ ననాన్గవ ఆదేశాలతో అక్కడి జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిలీజ్ అయిన వాళ్లలో మహిళలు, 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. దొంగతనాలు, చీటింగ్ వంటి కేసుల్లో శిక్ష పడిన వారిని వదలేసి, క్రూరమైన నేరాలు చేసిన వారిని మాత్రం జైల్లోనే ఉంచారు. ప్రభుత్వ నిర్ణయంపై విడుదలైన ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates