మీకు మీరే సాటి : బ్యాంక్ తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. SBI చెప్పిన కొత్త రూల్

sbiబెంగళూరులోని మార్తహళ్లికి చెందిన వందన అనే గృహిణి.. తన భర్త రాజేష్ కుమార్ కు రూ.25 వేలు విత్ డ్రా చేసుకునేందుకు తన SBI ATM కార్డు ఇచ్చి.. పిన్ నెంబర్ చెప్పింది. డబ్బులు డ్రా చేసేందుకు ATMకు వెళ్లిన రాజేష్ కు వింత అనుభవం ఎదురైంది. ATM మెషీన్లో కార్డుని స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకుండానే.. వచ్చినట్లు స్లిప్ వచ్చింది. దీంతో షాక్ అయిన భర్త రాజేష్ SBI కాల్ సెంటర్ కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. ఇది మెషీన్ తప్పు అని రాజేష్ తెలిపాడు. 24 గంటల్లో తిరిగి ఆ డబ్బులు అకౌంట్ లో జమ అవుతాయని రాజేష్ కు తెలిపారు. మరుసటి రోజు డబ్బులు అకౌంట్లోకి రాకపోవడంతో సంబంధిత బ్యాంక్ లో కంప్లయింట్ చేశాడు. దీన్ని పరిశీలించిన బ్యాంకు.. ట్రాన్సాక్షన్ కరెక్టేనని, కస్టమర్ డబ్బులు తీసుకున్నాడని ఆ దంపతులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దీంతో ATMలోని సీసీపుటేజీ ఆధారంగా మరోసారి బ్యాంక్ అధికారులకు కంప్లెయింట్ ఇచ్చారు. నాన్ ట్రాన్స్ ఫరబుల్ రూల్స్ ప్రకారం ATM యూజర్ అకౌంట్ హోల్డర్ కాదు అని.. బ్యాంకు విచారణ కమిటీ తెలిపింది. ATM పిన్ నెబర్ షేర్ చేయడం నిబంధనలు ఉల్లంఘించడమేనని బ్యాంకు తెలిపింది. పిన్ షేర్ చేయబడింది.. కేసు క్లోజ్ చేయబడిందంటూ బ్యాంకు తెలిపింది.

రాజేష్ భార్య వందన 2014 అక్టోబర్-21న బెంగళూరు 4వ అడిషనల్ జిల్లా వినియోగదారుల వివాదాల ఫోరంలో కంప్లెయింట్ చేశారు. తాను బిడ్డకు జన్మనిచ్చిన కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేక తన భర్తకు కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకురమ్మన్నానని తెలిపింది. అయితే ఫోరంలో కూడా బ్యాంక్ అధికారులు తమ వాదనకే కట్టుబడి ఉన్నారు. వందన తన భర్తకు డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు ఆథరైజేషన్ లెటర్ కానీ, సెల్ఫ్ చెక్కు అయినా కానీ ఇవ్వాల్సిందని కోర్టు ఈ కేసుని కొట్టివేసింది. అయితే డబ్బులు రాకుండానే.. వచ్చినట్లు స్లిప్ వచ్చింది కదా.. ఆ డబ్బులు ఏవీ అంటే మాత్రం బ్యాంక్ సమాధానం చెప్పకపోవటం విశేషం.

కోర్టు తీర్పుతో ఇదేం తీర్పురా బాబు అంటూ ప్రజలు బ్యాంక్ రూల్స్, కోర్టు తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి మీ ఫ్రెండ్స్ ATM నుంచి కానీ, పేరెంట్స్ ATM నుంచి కానీ, మరెవరి ATM నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిందే. వాస్తవంగా ఎవరి ATM కార్డు అయినా సరే పిన్ నెంబర్ తెలిస్తే చాలు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ATM మెషీన్ కు కస్టమర్ ఎవరో తెలియదు.. కేవలం నెంబర్లు మాత్రమే తెలుసు.. అలాంటిది డబ్బులు రాకుండా.. వచ్చినట్లు చూపించిన బ్యాంకు తప్పు లేదంటకానీ.. పిన్ నెంబర్ షేర్ చేసినట్లు నిర్ధారణ కావటంతో ఆ రూ.25వేల డబ్బు విషయంలో మాత్రం నోరెత్తటం లేదు SBI బ్యాంక్. ఏం రూల్ రా బాబూ ఇది అంటున్నారు కస్టమర్లు.

Posted in Uncategorized

Latest Updates