నీళ్ల మీటర్లు కావాలంటే BJPకి, వద్దనుకుంటే TRSకు ఓటేయండి: హరీష్ రావు

మీటర్లు కావాలనుకుంటే బీజేపీకి, వద్దు అనుకుంటే టీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు మంత్రి హరీష్ రావు.  ఇవాళ (గురువారం) సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో బాగంగా మాట్లాడిన ఆయన.. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేసిందన్నారు. బీజేపీ మాత్రం రైతులకు మేలు చేయకుండా  బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల దగ్గర, బోర్ల దగ్గర మీటర్లు ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, కష్టపడి పనిచేస్తున్నది ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిచిపోలేదని చెప్పారు మంత్రి హరీష్.

Latest Updates