‘మీ టూ’.. మలింగ భాగోతాన్ని బయటపెట్టిన చిన్మయి

మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల సపోర్ట్ కగా నిలుస్తున్న టాలీవుడ్‌ సింగర్‌ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును చిన్మయికి షేర్‌ చేయగా.. ఆమె ట్వీటర్‌ వేదికగా అందరికీ తెలియజేసింది. బాధితురాలు మలింగ గురించి చిన్మయికి ఇలా తెలిపింది.

కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌ లో తనకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది IPL సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో ఉన్నాడు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే.. ఒకరు ఆమె మలింగా రూంలో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం నన్ను బెడ్‌ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూంకు వెళ్లి నా ఫేస్‌ ను కడుక్కున్నాను. హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్‌ క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తెలిపారు’ అని బాధిత యువతి తన గోడును తెలిపినట్లు తెలిపింది చిన్మయి.

Posted in Uncategorized

Latest Updates