మీటూ..వింటానందపై అలోక్ నాథ్ పరువునష్టం

ముంబై : మీ..టూ వీవాదం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. పలువురి ప్రముఖుల పేర్లు బయటికి రావడంతో..అయోమయంలో పడుతున్నారు. ఈ క్రమంలోనే నటుడు అలోక్‌ నాథ్ తనను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ రచయిత్రి వింటా నందా త‌న‌ ఫేస్‌ బుక్‌ లో అకౌంట్ లో ఆరోపణలు చేసింది.  మీ..టూ ఉద్యమంలో భాగంగా ఆమె తన గత చేదు అనుభవాలను ఫేస్‌ బుక్‌ ద్వారా తెలిపింది.

నటుడు అలోక్‌ నాథ్ తనను వేధించాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ ఆరోపణలను ఖండించిన అలోక్ నాథ్.. ఇవాళ (అక్టోబర్-13)న కోర్టును ఆశ్రయించాడు. వింటా నందాపై పరువునష్టం కేసు వేశాడు. అంధేరి కోర్టులో అలోక్‌ నాథ్ భార్య ఆ దరఖాస్తును వేసింది. తన భర్తపై వచ్చిన తప్పుడు ఫిర్యాదులకు చర్యలు తీసుకోవాలని అంబోలీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

https://twitter.com/Bollywood_Clap/status/1051010617367252993

Posted in Uncategorized

Latest Updates