మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వద్దు : ఫేక్ న్యూస్ పై ఆ ఆదేశాలు రద్దు

PMఫేక్ న్యూస్ రాసినా,  ప్రచారం చేసినా జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేయనున్నట్లు సోమవారం(ఏప్రిల్2) కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. అయితే ఈ వివాదాస్పద గైడ్ లైన్స్ రద్దు చేయాలని సోమవారం రోజు విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ ఈ రోజు(ఏప్రిల్3)  ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) సమాచార మంత్రిత్వ శాఖకు సూచించింది.  ఫేక్ న్యూస్ కి సంబంధించిన అంశాలను ప్రెస్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా(PCI), న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌‌ సంస్థలకే వదిలేయాలని  ప్రధాని కార్యాలయం  సూచించడంతో ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

సోమవారం సమాచార మంత్రిత్వ శాఖ సవరణించిన గైడ్ లైన్స్ ప్రకారం…. మొదటి తప్పు చేస్తే ఆరు నెలలు, రెండో సారి చేస్తే సంవత్సరం, మూడో సారి తప్పు చేస్తే శాశ్వతంగా  జర్నలిస్ట్ అక్రిడేషన్ రద్దు చేస్తామని తెలిపింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో  ప్రధాని కార్యాలయం దీనిపై స్పందించడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు

Posted in Uncategorized

Latest Updates