మీతో పెట్టుకోలేం : చెన్నై నుంచి IPL మ్యాచ్ లు తరలింపు


బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. తమిళనాడులో జరుగుతున్న కావేరీ నదీ జలాల ఆందోళనతో IPL మ్యాచ్ లను చెన్నై నుంచి తరలించాలని నిర్ణయించింది. రైతులు ఆందోళనలో ఉన్న సమయంలో మనకు IPL క్రికెట్ మ్యాచ్ లు అవసరమా అంటూ రాజకీయ పార్టీల నుంచి సినీ హీరోల వరకు అందరూ ప్రశ్నించారు. దీంతో ఆయా పార్టీలు , సంఘాల కార్యకర్తలు మొదటి రోజు IPL మ్యాచ్ సందర్భంగా బీభత్సం చేశారు. స్టేడియం ఎదుట వేల సంఖ్యలో నిరసనకు దిగారు. స్టేడియంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన ఆందోళనలతో చెన్నై – కోల్ కతా మ్యాచ్ లో టాస్ వేయటం కూడా 15 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఇక ఆందోళనకారులు అయితే స్టేడియంలోకి పాములు వదులుతాం అని బెదిరింపులకు దిగటంతో ప్రేక్షకులు కూడా భయాందోళనలకు గురయ్యారు.

ఇన్ని టెన్షన్స్ మధ్య చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించటం కష్టం అని భావించింది బీసీసీఐ. చెన్నైలో జరిగే మిగతా ఆరు మ్యాచ్ లను ఇతర రాష్ట్రాల్లోని ఆయా స్టేడియాలకు తరలించాలని నిర్ణయించింది. ఏ మ్యాచ్.. ఏ రాష్ట్రంలో నిర్వహించాలి అనేది ఇంకా నిర్ణయించలేదు. మరో 24 గంటల్లో కొత్త వేదికలతో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది ఐపీఎల్ యాజమాన్యం.

Posted in Uncategorized

Latest Updates