మీదమీదకి వెళ్లారు : కాంగ్రెస్ – అన్నాడీఎంకే ఎంపీల మధ్య వాగ్వాదం

Lok-Sabha-congressలోక్ సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సీపీఎం పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకి పట్టుబట్టాయి ఆయా పార్టీలు. ఈ క్రమంలోనే తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకి దిగారు. కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ఎంపీలు అవిశ్వాసం తీర్మానం చర్చకి రాకుండా అడ్డుకుంటున్నారని.. బీజేపీకి తొత్తుగా మారారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహంగా ఊగిపోయిన అన్నాడీఎంకే ఎంపీలు పీఆర్ సుందరం, అరని ఎళుమలై కాంగ్రెస్ ఎంపీలపైకి దూసుకెళ్లారు. ఈ సమయంలో ఖర్గే కూడా స్పందించారు. నోటీస్ ప్రకారం సభ్యుల మద్దతు ఉందని.. వెంటనే చర్చ ప్రారంభించాలని పదేపదే కోరారు. కొందరు సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని.. అధికార పార్టీ కావాలనే ఇలా చేస్తుందని విమర్శించారు.

కాంగ్రెస్ ఎంపీల వ్యాఖ్యలతో అన్నాడీఎంకే సభ్యులు ఖర్గేతో వాగ్వాదానికి దిగారు. దీంతో సోనియాగాంధీతోపాటు వామపక్ష సభ్యులు జోక్యం చేసుకున్నారు. అన్నాడీఎంకే సభ్యులను వారించారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా కాంగ్రెస్ – అన్నాడీఎంకే ఎంపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ జరిగినన్ని రోజులూ నోటీస్ ఇస్తూనే ఉంటాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీలు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates