మీదే ఆలస్యం : రేపే చేప ప్రసాదం పంపిణీ

fish-medcineచేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిర కార్తె  సందర్భంగా  ఆస్తమా రోగులకు జూన్ 8వ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అవుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీస్, ఆర్ అండ్ బీ, ట్రాఫిక్, ఫిషరీస్ అండ్ మెడికల్ ఇలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వికలాంగులకు స్పెషల్ కౌంటర్లు ఉన్నాయి. వృద్దులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి రాకుండా.. టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు. ఇందు కోసం 34 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటికే లక్షా 30వేల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు. మత్స్యశాఖ నుంచి 350 మంది సిబ్బంది ఈ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేప ప్రసాదం కోసం వేలాది మంది తరలి వస్తుండటంతో.. భ్రదతపైనా దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. 1500 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలు చేప ప్రసాదం భద్రతను పర్యవేక్షించనున్నారు. మరో 150 మంది సిబ్బంది ట్రాఫిక్ బందోబస్తులో ఉండనున్నారు. 70 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి, సిటీలోని ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకోవటానికి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 133 బస్సులు నడుపుతుంది. వీరితోపాటు వెయ్యి మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య విధుల్లో నిర్వహించనున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి 100 మరుగుదొడ్లు, 100 మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్యం కోసం 108, 104 శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రసాదం వేయటం కోసం 800 మంది వాలంటీర్లు ఇప్పటికే ఏర్పాట్లలో బిజీ అయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates