మీరు కొంటే.. చెక్ చేసుకోండి : నీరవ్ మోడీ డైమండ్స్ నకిలీవా

nirav-modiనీరవ్ మోడీ, అతడి మామకి చెందిన డైమండ్స్ అండ్ జ్యువెలరీ షాపుల్లో మీరు ఆభరణాలు కొనుగోలు చేశారా.. అయితే ఒక్కసారి మళ్లీ చెక్ చేసుకోండి. నాణ్యతను పరిశీలించుకోండి.. డూప్లికేట్ అయ్యి కూడా ఉండొచ్చు.. హై క్వాలిటీ అని చెప్పి నాసి రకం డైమండ్స్, బంగారం అంటకట్టి ఉండొచ్చు.. ఈ విషయం మేం చెబుతున్నది కాదు.. మూడేళ్లుగా ఏడుగురు బీటెక్ స్టూడెంట్స్ చెబుతున్న మాట. అయినా ఎవరూ పట్టించుకోలేదు కదా.. కనీసం చెవికి కూడా ఎక్కించుకోలేదు. నీరవ్ మోడీ ఘోర మోసాలు బయటపడిన తర్వాత.. ఈ కుర్రోళ్ల పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

2013 అక్టోబర్ లో ఏడుగురు బీటెక్ స్టూడెంట్స్ డైమండ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలని భావించారు. RM గ్రీన్ సొల్యూషన్స్ సంస్థ స్థాపించారు.  పెట్టుబడిగా క్లౌడ్ ఫిండింగ్ రూపంలో రూ.3 కోట్లు సేకరించారు. వైవో కురానియా (24), దీపక్ బన్సల్ (23) ఇద్దరి ఆధ్వర్యంలో గీతాంజలి డైమండ్ అండ్ జ్యువెలరీ సంస్థ ఫ్రాంచైజీని తీసుకున్నారు. ఢిల్లీలోని రాజౌరీ ఏరియాలో షాపు ఓపెన్ చేశారు. నీరవ్ మోడీ కంపెనీకి సెక్యూరిటీ కింద కోటిన్నర చెల్లించారు. అందుకు తగ్గట్టుగానే డైమండ్స్, బంగారం పంపించారు. వాటి నాణ్యత చూసి వారు షాక్ అయ్యారు. అన్నీ నకిలీవి అని.. వజ్రాల్లో నాణ్యత లేవని.. కొన్ని డూప్లికేట్ కూడా ఉన్నాయని గుర్తించారు. దీనిపై నీరవ్ మోడీ, అతని మామ కంపెనీ అయిన గీతాంజలి సంస్థను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవటంతో ఈ ఏడుగురు బీటెక్ స్టూడెంట్స్.. రాజస్థాన్ రాష్ట్రం సాకేత్ కోర్టులో చోక్సీపై కేసు వేశారు

ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు.. నిజానిజాలు తేల్చాలని.. సంస్థపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వీరు చోక్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ 2017 ఆగస్ట్ లో ఢిల్లీ హైకోర్టును ఆదేశించాడు నీరవ్ మోడీ మామ చోక్సీ. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో దేశం నుంచి పారిపోయిన స్కామ్ వెలుగులోకి రావటంతో ఈ కుర్రోళ్లు కూడా బయటకు వచ్చారు. మూడేళ్లుగా వీరి మోసాలను చెబుతూనే ఉన్నామని.. ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. అప్పట్లోనే వీరి మోడీ మోసాలపై లోతుగా విచారణ చేసి ఉంటే.. ఇంత పెద్ద కుంభకోణం జరిగేది కాదని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates