మీ అఘాయిత్యం పాడుగాను : హాల్ టికెట్ పై బికినీ ఫొటో

BIKINIఓ విద్యార్థిని హాల్‌ టికెట్‌ పై అర్ధనగ్నంగా ఉన్న ఫోటో వచ్చింది. ఈ ఘటన లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకుంది. పాట్నాలోని మధుబాని SMJ  కాలేజీలో ఓ విద్యార్థిని సైన్స్ గ్రూపు(ఫైనలియర్) చదువుతుంది. మిథిలా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం (ఏప్రిల్-10) నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో యూనివర్సిటీ వెబ్‌ సైట్ నుంచి తన హాల్‌టికెట్‌ ను డౌన్‌లోడ్ చేసుకుంది విద్యార్థిని. ఆమె హాల్‌ టికెట్‌ లో తన ఫొటోకి బదులుగా బికినీ ధరించి ఉన్న మరో మహిళ ఫొటో ప్రింట్ అయ్యింది . దీంతో షాక్ కు గురైన ఆ విద్యార్థిని..  విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా బాధిత విద్యార్థిని మాట్లాడుతూ.. తన హాల్ టికెట్ ను చూసి షాక్ అయ్యానని.. ఎగ్జామ్స్‌ కు అప్లై చేసుకున్నప్పుడు తన ఫోటోనే అప్‌ లోడ్ చేశానని చెప్పింది. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మిస్టేక్ జరిగిందని తెలిపింది.

యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కుల్‌ నంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. బాధిత విద్యార్థినికి కొత్త హాల్‌ టికెట్‌ ను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2017 అక్టోబర్ నెలలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫస్టియర్ బీకామ్ విద్యార్థి ఫోటోకు బదులుగా తన హాల్‌ టికెట్‌ లో వినాయకుడి బొమ్మను ముద్రించారు. ఆన్‌ లైన్‌ లో జరిగే తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates