మీ ఇష్టం కాదు: ప్రభుత్వం ఆమోదిస్తేనే ఫీజు పెంచుకోవాలి

SCHOOLప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతీ ఏటా ఫీజులను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ…తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే…కఠిన చర్యలు చేపట్టడంతో పాటు…ఆయా స్కూళ్ల లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించింది విద్యాశాఖ. అయినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు రూల్స్ కు విరుద్ధంగా ఫీజు వసూలు చేస్తుంటంతో చర్యలకు సిద్ధమైంది విద్యాశాఖ.

ప్రైవేట్‌ స్కూళ్లు వసూలు చేసే వార్షిక ఫీజులను విద్యాశాఖకు సమర్పించినంత మాత్రాన వాటిని ప్రభుత్వం ఆమోదించినట్లు కాదని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం దగ్గర ఆయా స్కూళ్ల ఫీజుల వివరాలు ఉంటే పరిశీలించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిఏటా సమర్పించాలని చెప్పామని ఆయన తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు రూపొందించేందుకు తిరుపతిరావు ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన కమిటీ డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. ఏటా 10 శాతం వరకు ఫీజులను పెంచుకోవచ్చనడానికి ప్రాతిపదిక ఏమిటి? ఫీజులను విద్యాశాఖకు సమర్పిస్తే ప్రభుత్వం వాటిని ఆమోదించినట్లు కాదా? తదితర సందేహాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య లేవనెత్తారు. వాటిపై మూడు నెలల్లో స్పష్టత ఇవ్వాలని కమిటీని మార్చి 19న ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో ఈనెల 19న సందేహాలపై స్పష్టత ఇస్తూ నివేదిక సమర్పించారు.

ఏ స్కూలు విద్యార్థుల నుంచి ఎంత వసూలు చేస్తుందో విద్యాశాఖకు తెలియాల్సి ఉంది… కాబట్టి వార్షిక ఫీజులతో పాటు ఆదాయ, వివరాలను విద్యాశాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పామన్నారు.

పెంచిన ఫీజు వివరాలను స్కూలు యాజమాన్యాలు ముందే తల్లిదండ్రులకు తెలపాలంది. 1 నుంచి 5… 6నుంచి 10 తరగతులు తరహాలో స్లాబ్‌ల్ని నిర్ణయించాలని.  కమిటీ ఆయా అంశాలపై స్పష్టత ఇచ్చినందున తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates