మీ ఐడియాలు చెప్పండి : పంద్రాగస్ట్ స్పీచ్ ప్రిపరేషన్ లో మోడీ

ఆగస్టు-15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ దగ్గర తన స్పీచ్ లో ఏయే అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందని ప్రజలను మోడీ కోరారు. నరేంద్రమోడీ యాప్ ద్వారా మీ ఐడియాలను పంపించండి అంటూ దేశ ప్రజలను కోరారు. ప్రజలు తమ సమస్యలు, కొత్త ఆలోచనలను తెలియజేయడం ద్వారా వాటిని తన ఆగస్టు-15 స్పీచ్ లో ప్రస్తావిస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ప్రధానమంత్రి. ఈ ఏడాది ఆగస్టు-15న 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతదేశం జరుపుకోబోతుంది. ప్రధానిగా ఇది మోడీ చేయబోయే 5వ స్పీచ్. మూడేళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రజల ఐడియాలను మోడీ ఆహ్వానించారు.

Posted in Uncategorized

Latest Updates