మీ టూ : కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా

ఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. మీ టూ.. ఉద్యమంలో భాగంగా పలువురు మహిళా జర్నలిస్టుల నుంచి అక్బర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని తాను కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించిన క్రమంలో .. ఆ పోరాటాన్ని ఓ సాధారణ వ్యక్తిగానే కొనసాగిస్తానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన ఓ లేఖలో వెల్లడించారు. విదేశాంగ శాఖ కార్యాలయంలో తన రాజీనామాను సమర్పించినట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే ఆయన తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జర్నలిస్టులకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అక్బర్ విమర్శించారు. ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు తొలిసారి అక్బర్‌పై ఆరోపణలు చేసింది. పలు పత్రికలకు ఆయన ఎడిటర్‌ గా ఉన్న సమయంలో తమను లైంగికంగా వేధించారని మహిళా జర్నలిస్టులు ఆరోపించారు.

 

Posted in Uncategorized

Latest Updates