మీ టూ పై రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు : నానా అలాంటోడే..కానీ

 మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మీ టూ ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్రమంత్రి అక్బర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మీ టూ ఉద్యమం ఉద్దృతమైన ఈ సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణసేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ టూ చాలా సీరియస్ విషయం అని, దీని గురించి సోషల్ మీడియాలో చర్చించడం సరైంది కాదన్నారు. మీ టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్ గురించి తనకు తెలుసునని, అతడు అమర్యాదస్తుడే కానీ ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కాదని తనకు తెలుసునని ఠాక్రే అన్నారు. దేశంలో పెరుగుతున్న పెట్రోలు ధరలు, రూపాయి పతనం, పెరుగుతున్న నిరుద్యోగం గురించి ప్రజలను మళ్లించేందుకే మీటూ పేరిట ఉద్యమం చేపట్టారన్నారు. మహిళలు ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే బాధితులు సహాయం కోసం తమ పార్టీని సంప్రదించవచ్చన్నారు. లైంగికవేధింపులపై పదేళ్ల తర్వాత కాకుండా వెంటనే స్పందించాలని ఠాక్రే సూచించారు.

Posted in Uncategorized

Latest Updates