మీ టూ పై స్పందించిన రాహుల్ గాంధీ

మీ టూ క్యాంపెయిన్ పై శుక్రవారం(అక్టోబర్-12) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. మహిళల పట్ల గౌరవం, ఆదరాభిమానాలతో వ్యవహరించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సమయమిదని అన్నారు. సమాజంలో మార్పు తేవాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని రాహుల్ ట్వీట్ చేశాడు.

కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న సమయంలో ‘మీ టూ’కు రాహుల్ మద్దతుగా నిలబడటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకొంది.

Posted in Uncategorized

Latest Updates