మీ పిల్లల్ని రోలర్ కాస్టర్ ఇలా ఎక్కించొచ్చు..

రోలర్ కాస్టర్ ఎక్కాలంటే పెద్దవాళ్లే కాస్త వెనకాముందూ ఆలోచిస్తుంటారు. చాలామంది మాత్రం… అబ్బో! గాల్లో గింగిరాలు తిరుగుతుంటే మా దిమ్మ తిరుగుతుంది మేం ఎక్కలేం అని పక్కకు తప్పుకుంటారు. అందులో.. ఫన్ ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు మాత్రం రోలర్ కోస్టర్ ను పిచ్చిపిచ్చిగా లైక్ చేస్తారు. చిన్నపిల్లలకు రోలర్ కోస్టర్ రైడ్ చూస్తున్నప్పుడు ఫన్ గా అనిపిస్తుండొచ్చు. కానీ వారిని ఆ చిన్నవయసులో దానిని ఎక్కించలేం. ఐతే.. ఈ రైడ్ ఇచ్చే ఫన్ మాత్రం వాళ్లకు పరిచయం చేయొచ్చు అంటున్నాడు ఓ తండ్రి. టీవీలో రోలర్ కోస్టర్ రైడ్ ను తన బుజ్జాయికి చూపిస్తూ.. ఆమెను ఓ  తొట్టిలో కూర్చోపెట్టి రైడ్ లోని మజా అందించాడు. అదెలాగో.. వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. వీడియో బాగుంది. మీరూ మీ పిల్లలతో , లేదా చిన్న పిల్లలతో ఓసారి ట్రై చేయొచ్చు.

Posted in Uncategorized

Latest Updates