మీ పోలీసింగ్ సూపర్ : పంజాగుట్ట పీఎస్ లో కేరళ సీఎం

policeహైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థ చాలా బాగుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును పరిశీలించారు. తర్వాత పోలీసులను విజయన్ అభినందించారు.

దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు పొందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం, సేవలు, నిర్వహణ తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు సీఎం పినరయి.

Posted in Uncategorized

Latest Updates