మీ రుణం తీర్చలేనిది సారూ : మంత్రి హరీశ్ సాయంతో.. బాలుడికి పునర్జన్మ

harish

ఆ బాలుడికి పుట్టకపోతే గుండె జబ్బు. బతుకుతాడో లేదో తెలియని పరిస్థితి. ఆపరేషన్ చేస్తే బతుకుతాడని ఆ తల్లిదండ్రులకు చెప్పారు వైద్యులు. అందుకు లక్షలు ఖర్చు అవుతుందన్నారు. రూ.6 లక్షలు సిద్ధం చేసుకుంటే చికిత్స మొదలుపెడతాం అని డాక్టర్లు తేల్చేశారు.

ఉపాధి కోసం హైదరాబాద్‌ లో వచ్చిన సతీశ్.. డాక్టర్లు చెప్పిన మాట విని షాక్ అయ్యాడు. ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను.. అంత కట్టలేనని చెప్పాడు. ఎంత తగ్గించినా లక్షల్లోనే ఆపరేషన్ ఖర్చు అవుతుందని తెగేసి చెప్పారు డాక్టర్లు. దీంతో విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. సాయం చేయాలని అర్ధించారు. వారి బాధ విన్న హరీశ్.. వారికి భరోసా ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడారు. ఆపరేషన్ కు కావాల్సిన రూ.6 లక్షలు వారికి అందచేశారు. దీంతో జనవరి 23వ తేదీ చిన్నారికి ఆపరేషన్‌ చేశారు.

ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం సిద్ధిపేట పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్ కు.. సతీశ్‌ దంపతులు పసికందుతో వచ్చి కలిశారు. చిన్నారిని చూపించారు. మీ దయతోనే బాబుకి పునర్జన్మ ఇది అని ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలపారు. హరీశ్‌రావు బాబును చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. బాబుకు పునర్జన్మ ఇచ్చిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు ఆ తల్లిదండ్రులు..

Posted in Uncategorized

Latest Updates