మీ వెనకే అందరూ : ఫాలోవర్స్ తో టాలీవుడ్ నెం.1మహేష్

MAHIతెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో మోస్ట్ ‌డిజైరబుల్‌ మెన్ టాప్‌ లిస్ట్‌ 2014, 2015లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు 60 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ తో మహేశ్ మరో మైలురాయి అందుకున్నాడు. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. మహేశ్‌ ఫాలో అయ్యేది మాత్రం కేవలం ఆయన బావ, ఎంపీ గల్లా జయ్‌దేవ్‌ ఒక్కరినే కావటం విశేషం. హీరోయిన్లలో 70 లక్షల మంది ఫాలోవర్స్ తో  శ్రుతిహాసన్‌ దక్షిణాదిలో నెం.1 గా నిలిచింది. ఇక 60 లక్షల మంది ఫాలోవర్స్ తో సమంత సెకండ్ ఫ్లేస్ లో ఉంది. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో రూపొందుతున్న ‘భరత్‌ అను నేను’ సినిమాలో నటిస్తున్నారు మహేశ్‌. ఏప్రిల్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted in Uncategorized

Latest Updates