మీ సంపాదన మీదే : క్రీడాకారుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన హర్యానా ప్రభుత్వం

manoharఆదాయంలో మూడో వంతు స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు కట్టాలంటూ ఏప్రిల్-30 న వివాదాస్పద నోటిఫికేషన్ రిలీజ్ చేసిన హర్యానా ప్రభుత్వం క్రీడాకారుల ఆగ్రహంతో వెనక్కి తగ్గింది,

క్రీడాకారుల ఆదాయంలో 33 శాతం పన్నుపై వెనక్కి తగ్గింది హర్యానా సర్కార్. గతంలో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నామన్నారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఏప్రిల్ 30న ఇచ్చిన నోటిఫికేషన్ పై ప్లేయర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో..  దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు ఖట్టర్.  అంతకు ముందు … రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని  నోటిఫికేషన్ ఇచ్చింది క్రీడా శాఖ. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఆ నోటిఫికేషన్ లో తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates