మీ సేవలు కావాలి : జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా తిరస్కరణ

raviమక్కా మసీద్ బాంబు పేలుడు కేసును సరైన ఆధారాలు చూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందంటూ కేసుని కొట్టివేస్తూ 3 రోజుల క్రితం తీర్పు చెప్పారు NIA స్పెషల్ కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి. అదే రోజు జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది. తనకు అత్యవసరంగా 15 రోజులు సెలవులు కావాలని ఆయన కోరారు. అయితే రవీందర్ రెడ్డి రాజీనామాను తిరస్కరిస్తూ తక్షణం విధులకు హాజరు కావాలంటూ హైకోర్టు తెలిపింది. రవీందర్ రెడ్డి సెలవులు కూడా రద్దు చేశారు.

Posted in Uncategorized

Latest Updates