మీ సేవా కేంద్రాల్లోనూ మనీ విత్ డ్రా


బ్యాంకులు, ఏటీఎంల నుంచే కాకుండా మీ సేవా సెంటర్ల నుంచి కూడా మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం( జూలై-30 )నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీసేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మీ సేవా రాష్ట్ర కమిషనర్‌ జీటీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆధార్‌ బేస్‌డ్‌ పెమెంట్‌ సిస్టమ్‌ ద్వారా విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4వేల 500 మీసేవ కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం  రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి సారిగా ఈ తరహా విధానం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10 వేలు విత్‌డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకు కస్టమర్ల నుంచి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయబోమన్నారు. 30వ (సోమవారం) తేదీన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వివరించారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో క్యాష్‌ విత్‌డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates