ముంచుకొస్తున్నముప్పు: అంటార్కిటికాలో కరుగుతున్న మంచు

antarciticaకనుచూపు మేర విస్తరించిన మంచు.. కనువిందు చేసే హిమ సౌందర్యం అంటార్కిటికా ఖండానికే సొంతం. పెంగ్విన్ల సోయగాలు, ధ్రువపు ప్రాంత జంతువులతో అలరారే ఈ మంచు ఖండం ఓ భారీ ముప్పును ఎదుర్కోనుంది. అంతేకాదు యావత్తు ప్రపంచానికి పెనుముప్పు తీసుకురానుంది.

వాతావరణ కాలుష్యం పెరుగుతున్న వేళ అంటార్కిటికా ఖండంలో మంచు కరిగిపోతోంది. గతంలో కంటే మూడురెట్లు వేగంగా మంచు కరుగుతున్నట్లు తాజాగా అధ్యయనంలో బయటపడింది. అంటార్కిటికాలో ఉన్న మంచు ఫలకాలపై గ్లోబల్‌ వార్మింగ్‌ చూపుతున్న ప్రభావాన్ని నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీల సాయంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది.మంచు ఎక్కువగా కరగడంతో సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates