ముందస్తు నిర్ణయమే : కొచ్చర్ ను లీవ్ పై వెళ్లమని కోరలేదన్న ICICI

KOCHAవీడియోకాన్ కేసులో బ్యాంక్ అంతర్గత దర్యాప్తు ముగిసే వరకూ కొన్ని రోజులు ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచ్చర్ ను సెలవులపై వెళ్లిపోవాలని బ్యాంక్ ఉద్యోగులు కోరినట్లు వస్తున్న వార్తలను శుక్రవారం(జూన్-1) ఖండించింది ఐసీఐసీఐ బ్యాంక్. లీవ్ తీసుకోవాలని కొచ్చర్ ముందుగానే నిర్ణయించారని, అందువల్లే ఆమె లీవ్ లో ఉన్నరని, తాము సెలవులు తీసుకోమని కొచ్చర్ ను కోరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఓ సెర్చ్ కమీటీని నియవించారన్న వార్తలను కూడా బ్యాంక్ ఖండించింది.

Posted in Uncategorized

Latest Updates