ముందున్నవి మంచిరోజులే.. ఇండియా గ్రోత్ రేట్ పెరుగుతోందన్న IMF

వాషింగ్టన్ : భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని తెలిపింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్). 2018లో ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7.3%గా నమోదవుతుందని అంచనా వేస్తోంది. 2019లో ఇండియా జాతీయ వృద్ధిరేటు మరింతగా పెరిగి… 7.4%గా రికార్డ్ అవుతుందని ప్రిడిక్ట్ చేస్తోంది.

భారత జాతీయ వృద్ధిరేటు 2017లో 6.7శాతంగా రికార్డైంది. 2019లో భారత వృద్ధిరేటు మరింత ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ఏప్రిల్ లో వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ సంస్థ తెలిపింది. ఐతే… ఇటీవల ఆయిల్ రేట్ల పెరగడం.. గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఒత్తిడికి లోను కావడంతో.. అంతకంటే తక్కువగానే 7.4శాతంగా జీడీపీ వృద్ధి రేట్ ఉండొచ్చని ఐఎంఎఫ్ అంటోంది. జీఎస్టీ, ఇతర ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ మునుపటి కంటే బలహీనపడింది. ఐతే… ఈ ఆర్థిక సంస్కరణ ఫలితంగా భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఐఎంఎఫ్ అంచనాలు భారత ఎకానమీకి బూస్ట్ నిచ్చేలా ఉన్నాయి.

ఈ అంచనాలు నిజమైనట్టయితే… వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. 2018 ఏడాదిలో… చైనాను 0.7 శాతం తేడాతో వెనక్కు నెడుతుంది. 2019నాటికి చైనా కంటే కూడా 1.2శాతం గ్రోత్ రేట్ ఎక్కువగా ఇండియా నమోదుచేసినట్టవుతుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates