ముంబైకి ఏమైంది : నిలువునా చీలిన గ్రాంట్ రోడ్ బ్రిడ్జి

mumbai_bridgeముంబై మహానగరానికి ఏమైంది.. వరస ఘటనతో ఇప్పుడు అక్కడి ప్రజలను ఈ ప్రశ్న వేధిస్తోంది. రెండు వారాలుగా భారీ వర్షాలు.. ఆ తర్వాత బ్రిడ్జి కూలిపోయింది.. ఇప్పుడు గ్రాంట్ రోడ్ బ్రిడ్జికి పగుళ్లు.. నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తటం… అది పరిష్కారం అయ్యేలోపు మరో విపత్తు రావటం ఇలా ముంబైవాసులు ఆందోళన చెందుతున్నారు. జూలై 3వ తేదీ మంగళవారం రాత్రి.. దక్షిణ ముంబైలోని గ్రాంట్ రోడ్ బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయి. దీంతో దీనిపై రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ఈ బ్రిడ్జి నానా చౌక్ – నోవెల్టి సినిమా ప్రాంతాలను కలుపుతుంది. మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది.

ఈ బ్రిడ్జికి పగుళ్లు రావటంతో.. ట్రాఫిక్ కెన్నడీ బ్రిడ్జి వైపు నుంచి మళ్లించారు. బ్రిడ్జిపై ఏర్పడిన పగుళ్లతో తీసిన ఫొటోను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ముంబై సిటీ పోలీసులు. ఎవరూ అటువైపు వెళ్లొద్దని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను తెలిపారు. రెండు వారాలుగా వర్షాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ముంబై కార్పొరేషన్ తెలిపింది. ఈ పగుళ్లతో బ్రిడ్జి పటిష్ఠతను పరిశీలించటానికి ఇంజినీర్లు రంగంలోకి దిగారు.

Posted in Uncategorized

Latest Updates