ముంబైకి చేరిన సినీ లోకం

srideviసినీ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ సినిమా ఇండస్ట్రీ షాక్ కు గురైంది. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, క్రీడా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని… ముంబై అంధేరిలోని ఆమె నివాసానికి తీసుకురానున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఆమెను చివరి సారిగా చూసి… నివాళులర్పించేందుకు ఇప్పటికే ఆమె ఇంటికి పెద్ద ఎత్తున సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు చేరుకున్నారు. దాదాపుగా బాలీవుడ్ నటీనటులంతా తరలిరాగా.. టాలీవుడ్ నుంచి వెంకటేశ్ ముంబై చేరుకున్నారు. శృతిహాసన్, టబు, ఫరాఖాన్, అమీషాపటేల్, నాజర్, ఫర్హాన్ అక్తర్, వెంకటేశ్, అర్జున్ కపూర్, రేఖ,అర్జున్ కపూర్,మాధురీదీక్షిత్ దంపతులు,జయప్రద,రాణీముఖర్జీ,కరణ్ జోహార్, డ్యాన్స్ డైరెక్టర్ సరోజాఖాన్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ శ్రీదేవి ఇంటికి చేరుకున్నారు.

వీరితో పాటు..తమ అభిమాన తారను చివరిసారిగా చూసేందుకు శ్రీదేవి  ఇంటికి అభిమానులు పోటెత్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates