ముంబైకి చేరుకున్నశ్రీదేవి భౌతికకాయం

srideviనటి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంది. ముంబైలోని ఛత్రపతి విమానాశ్రయానికి శ్రీదేవి పార్థీవదేహం చేరుకోవడం ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీదేవి భౌతికకాయం వెంట బోనీకపూర్, ఖుషీ కపూర్ ఉన్నారు. అనిల్ కపూర్ ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

విమానాశ్రయ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే భౌతికకాయాన్ని గ్రీన్ ఎకర్స్ లోని శ్రీదేవి ఇంటికి తీసుకెళతారు.. బుధవారం(ఫిబ్రవరి-28) ఉదయం అభిమానుల సందర్శన తర్వాత మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే శ్రీదేవి నివాసానికి భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు చేరుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates