ముంబైని ఏడిపించిన ప్రేమ కథ : అతనో వ్యాపారి.. ఆమె ఉద్యోగి.. అయినా..

mumbaiఅతని పేరు సల్మాన్.. 26 ఏళ్లు.. చూడ్డానికి హీరోలా ఉంటాడు. ముంబైలో ప్రేరుమోసిన ఓ బట్టల దుకాణానికి ఓనర్. మంచిగా డబ్బులు సంపాదించాడు.. 20 లక్షల కారులో తిరుగుతుంటాడు.. ముంబైలో ఇల్లు ఉంది.. కుటుంబం పెద్దది.. ఎలాంటి బాధలు లేవు.. చెడు అలవాట్లు కూడా లేవు.. ఆమె పేరు మనీషా నారాయణ్.. 21 ఏళ్లు.. చాలా అందంగా ఉంటుంది.. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో ఉద్యోగం.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉంటుంది.. ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత అందం.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నాలుగేళ్లుగా.. ఒకరు అంటే ఒకరు విడిచి ఉండలేనంతగా గాఢ ప్రేమ. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. రెండు కుటుంబాలు ససేమిరా అన్నాయి. మేం చావనైనా చస్తాం కానీ.. మీ పెళ్లి చేయం అని రెండు కుటుంబాలు ఖరాఖండిగా చెప్పాయి. ఇంట్లో వాళ్ల చావును చూడలేని ఈ ప్రేమ జంట.. వాళ్లే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ముంబై నగరాన్ని ఏడిపించిన ఈ ప్రేమ కథ మీ కోసం..

పెళ్లి కోసం సల్మాన్ – మనీషా చేయని ప్రయత్నాలు లేవు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు వీళ్లద్దరూ ఎన్నో రకాలుగా ఒప్పించే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేదు. ఒకరిది వ్యాపారం, మరొకరిది ఉద్యోగం. బయటకు వెళ్లిపోయి హాయిగా బతికేయొచ్చు. ఆర్థికంగానూ బలంగా ఉన్నారు. అయినా వారు అలా చేయలేదు. కుటుంబంతోనే కలిసి ఉండాలని చివరి వరకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నాలుగు రోజులుగా ఇంటికి సరిగా వెళ్లటం లేదు. కుటుంబ పెద్దలతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. సల్మాన్ మాత్రం రంజాన్ ఉపవాసం ఉంటున్నాడు. ఇఫ్తార్ కోసం ఇంటికి వెళ్లి వెంటనే వచ్చేస్తున్నాడు. ఇద్దరూ కూడా నాలుగు రోజులుగా వారి వారి పనుల్లో బిజీగా ఉంటూనే.. పెళ్లికి సంబంధించిన విషయాలపై చర్చించుకుంటున్నారు.

నాలుగు రోజులుగా ఎక్కువగా ఇంటికి వెళ్లని వీరు.. పెళ్లి చేసుకుంటున్నాం అని ఇంట్లో వారికి మంగళవారం ఫోన్ లో చెప్పారు. రెండు కుటుంబాల నుంచి ఊహించని సమాధానం. మీరు పెళ్లి చేసుకుని వస్తే.. మా శవాలను చూస్తారు ఇంటూ వారి వారి ఇళ్ల నుంచి సమాధానం వచ్చింది. ఎప్పటికీ మనం పెళ్లి చేసుకోలేం.. కలిసి బతకలేం అనుకున్నా ఈ జంట.. వారికి ఇష్టమైన కారులోనే బుధవారం సాయంత్రం విషం తీసుకుని చనిపోయారు.

ముంబై ములుంద్ లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో కారు అనుమానాస్పందంగా ఉండటం.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు ఇంజిన్ ఆన్ చేసి ఉండటంతో డోర్స్ బ్రేక్ చేసి చూశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయి ఉన్నారు. షోడాలో విషం కలుపుకుని తీసుకున్నారు. సల్మాన్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా.. మనీషా డెడ్ బాడీ ఇంకా మార్చురీలోనే ఉంది.. ఈ వార్త రాసే సమయానికి వారి కుటుంబ సభ్యులు ఇంకా ఆస్పత్రికి కూడా రాలేదు.. ముంబై నగరాన్ని ఏడిపించిన ప్రేమ కథ ఇది.. మరో మరో చరిత్రను గుర్తు చేసింది..

 

Posted in Uncategorized

Latest Updates