ముంబైలో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

ముంబై : అగ్ని ప్రమాదంలో ఐదుగురు చనిపోయిన సంఘటన ముంబైలో గురువారం రాత్రి జరిగింది. తిలక్‌ నగర్‌ లోని ఓ అపార్టుమెంట్ 11వ అంతస్తులో షార్టు సర్క్యూట్ అయ్యింది. కరెంటు మెరుపులు ఎక్కువ కావడంతో.. సిలిండరు పేలి మంటలు వ్యాపించాయి. అపార్టుమెంట్ లో దట్టంగా పొగ వ్యాపించడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. భవనంలో అగ్నిమాపక వ్యవస్థ పనిచేయక పోవడంతో సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు.

చనిపోయినవారిని సునీతా జోషి, బాలచంద్ర జోషి, సుమన్ జోషి, సరళా గంగార్, లక్ష్మీబెన్ గంగార్ లు ఉన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస జోషి, ఫైర్ మెన్ చాగన్ సింగ్ లను హస్పిటల్ కి తరలించారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

 

Posted in Uncategorized

Latest Updates