ముంబైలో భారీ అగ్నిప్రమాదం

fireముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాంఖడ్ ఏరియాలోని మాయా హోటల్ దగ్గర్లో ఓ షాపులో ఆదివారం(ఫిబ్రవరి-11) భారీస్థాయిలో  మంటలు చెలరేగాయి. షాపు నుంచి అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హోటల్ పరిసరాల్లో ఉన్న గోదాములకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన ఫైర్ సేఫ్టీ అధికారులు మంటార్పే పనిలో ఉన్నారు. మొత్తం 24ఫైరింజన్ల సాయంతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షాప్ లోపల మనుషులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటలు ఎలా వచ్చాయనేది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates